Your Language
పసిఒఎస్‌ గురించిన నిజాలను పంచుకొనుట
+ పిసిఒఎస్‌ అంటే ఏమిటి?
పాలిసిస్టిక్‌ ఓవరి సిండ్రోమ్‌ (పిసిఒఎస్‌) అనేది పిల్లలను కనగల వయస్సు గల (1545 సంవత్సరాలు) ఆడవాళ్ళు నేడు ఎదుర్కొంటున్న అత్యంత సామాన్యమైన సమస్యల్లో ఒకటి. భారతదేశంలో పిల్లలను కనగల వయస్సులో ఉన్న స్త్రీ జనాభాలో దాదాపు 36% మంది పిసిఒఎస్‌తో బాధపడుతున్నారు లేదా పిల్లలను కనగల వయస్సులో ఉన్న ప్రతి నలుగురు (4) మహిళల్లో ఒకరికి (1) పాలిసిస్టిక్‌ అండాశయాలు ఉంటున్నాయి. ఇటీవల కాలంలో కూడా సామాజిక లేదా మీడియా విభాగాల్లో ఆడవాళ్ళ ఆరోగ్యంతో అత్యంత ఎక్కువగా ముడిపడివున్న అంశం పిసిఒఎస్‌. ఈ సమస్య చాలా సామాన్యమైనది మరియు మనలో ఎవ్వరికైనా కలగవచ్చు. చికిత్స చేయకుండా వదిలేస్తే వంధ్యత్వానికి (పిల్లలను కనలేకపోవడం) దారితీసే పిసిఒఎస్‌ యొక్క సంక్లిష్ట సమస్యలను నివారించేందుకు మరియు అధిగమించేందుకు ఎవరైనా సరే అర్థంచేసుకోవలసిన ముఖ్యమైన విషయాలు ఏమిటో ఇక్కడ ఇస్తున్నాము.

పిసిఒఎస్‌ని కనుగొనడానికి సహాయపడే చిహ్నాలు
 • అక్నే/మొటిమలు మరియు హిర్సూటిజం/వెంట్రుకలు ఎక్కువగా పెరగడం
 • ఊబకాయం/బరువు పెరగడం
 • క్రమరహితంగా బహిష్ఠు పీరియడ్‌లు
 • పిగ్మెంటేషన్‌, ప్రత్యేకించి మెడపై మరియు చంకల్లో
 • పాలిసిస్టిక్‌ అండాశయాలు (అండాశయాల్లో తిత్తులు కలుగుతాయి) - అల్ట్రా సోనోగ్రఫి (యుఎస్‌జి) ద్వారా ధృవీకరించవచ్చు.

పిసిఒఎస్‌ చిహ్నం చిన్నతనంలోనే మొదలవ్వవచ్చు, కానీ చాలా కేసుల్లో యవ్వనం తరువాత మరియు యుక్తవయసు ప్రారంభంలో చిహ్నలు కలుగుతుంటుంది. పిసిఒఎస్‌ని తరచుగా తప్పుగా-నిర్ధారిస్తుంటారు లేదా మొటిమలు మరియు హిర్సూటిజం/ఎక్కువగా వెంట్రుకలు పెరగడం లాంటి చిహ్నాలను కాస్మొటోలాజికల్‌ సమస్యగా ఖచ్చితంగా స్వయంగా-నిర్ధారణ చేస్తుంటారు.

అయితే, చాలా మట్టుకు ఆడవాళ్ళకు బహిష్ఠు చక్రంలో సమస్య కలిగేంత వరకు లేదా గర్భందాల్చడం కష్టంగా ఉన్నట్లు కనుగొనేంత వరకు తమకు పిసిఒఎస్‌ ఉందనే విషయం గ్రహించలేరు.

1) పాలిసిస్టిక్‌ ఓవరీస్‌ (అండాశయాల్లో తిత్తులు కలుగుతాయి):
ప్రతి మహిళకూ రెండు అండాశయాలు ఉంటాయి. ఇది గర్భాశయానికి ఇరు వైపులా ఉంటాయి. ఒక్కో అండాశయం దాదాపు పెద్ద మార్బుల్‌ సైజులో ఉంటుంది. అండాశయాలు గుడ్లు మరియు వివిధ హార్మోన్‌లు తయారుచేస్తాయి.
సాధారణంగా, ప్రతి బహిష్ఠు చక్రంలో, అండాశయాల్లో అనేక చిన్న ఫోలికల్స్ పెరుగుతుంటాయి మరియు అండాలను ఏర్పరుస్తాయి. చక్రం-మధ్యలో, ఒక అండం అండాశయాల్లో ఒకదాని నుంచి ఫాలోపియన్‌ ట్యూబుల్లోకి విడుదల చేయబడుతుంది. దీన్ని ``ఒవులేషన్‌'' ప్రక్రియ అని అంటారు. ఇతర ఫోలికల్స్ ఎక్కువగా పండిపోయి విచ్ఛిన్నమవుతాయి.
పిసిఒఎస్‌ గల ఆడవాళ్ళల్లో, ఒవులేషన్‌ కలగదు మరియు అండం విడుదల కాదు. ఫోలికల్స్ విచ్ఛిన్నం కావు, కానీ ఫ్లూయిడ్‌తో నిండివుంటాయి మరియు కొంతమేరకు ద్రాక్ష గుత్తి మాదిరిగా కనిపించే తిత్తిల్లోకి మారతాయి. అండాశయాలు వాయవచ్చు, కొన్నిసార్లు మామూలు కంటే రెండు నంచి అయిదు సార్లు పెద్దవి కావచ్చు.
మీకు పాలిసిస్టిక్‌ అండాశయాలు ఉన్నాయా లేదా అనే విషయం నిర్ధారించేందుకు అల్ట్రాసౌండ్‌ స్కాన్‌ని మీ డాక్టరు సిఫారసు చేయవచ్చు.

2) క్రమం తప్పిన బహిష్టు పీరియడ్‌లు:
ఒక మహిళ యొక్క సంతానోత్పత్తి వయస్సు సగటున 28 రోజుల బహిష్ఠు చక్రం ఉంటుంది, అయితే ఇది 25 నుంచి 35 రోజులకు మారిపోవచ్చు. పిసిఒఎస్‌ గల ఆడవాళ్ళల్లో, బహిష్ఠు పీరియడ్‌లు సాధారణంగా >35 రోజుల విరామాల్లో (క్రమరహిత బహిష్ఠు వ్యవధి) కలగవచ్చు లేదా కలగకపోవచ్చు.
మనం ఇటీవలి అధ్యయనాలను గమనిస్తే పిసిఒఎస్‌ గల దాదాపు 99% మంది మహిళలకు బహిష్ఠు క్రమబద్ధంగా ఉండదు.
మీకు బహిష్ఠు చక్రాలు క్రమరహితంగా ఉంటే, ఆలస్యం అవ్వకముందే చర్యలు తీసుకోండి మరియు సాధ్యమైనంత వెంటనే మీ డాక్టరును సంప్రదించండి.3) మొటిమలు మరియు వెంట్రుకలు ఎక్కువగా పెరగడం:
మొటిమలు మరియు వెంట్రుకలు ఎక్కువగా పెరగడం అనేవి పిసిఒఎస్‌ యొక్క అత్యంత సామాన్య మైన లక్షణాల్లో ఒకటి. హిర్సూటిజం అంటే వెంట్రుకలు ఎక్కువగా పెరగడం తప్ప మరేమీ కాదు, సాధారణంగా పిరుదులపై, వీపుపై, ఛాతి లేదా ముఖంపై. అయితే మొటిమలు అనేది ఒక రకం చర్మ వ్యాధి, దీనిలో పాపులేస్‌ ఏర్పడటం మొటిమల మాదిరిగానే ఉంటుంది. మొటిమలు సాధారణంగా ముఖం, వీపు మరియు ఛాతిపై ఉంటాయి. పిసిఒఎస్‌ గల మహిళల్లో దాదాపు 75% మందికి హిర్సూటిజం ఉంటుంది మరియు పిసిఒఎస్‌ గల మహిళల్లో దాదాపు 34% మందికి అక్నే/మొటిమలు ఉంటాయి.
పిసిఒఎస్‌ గల మహిళల్లో, అండాశయ తిత్తులు హార్మోన్‌లలో సమతుల్యం కలిగిస్తాయి, కాబట్టి పురుష హార్మోన్‌ల ఉత్పత్తి (టెస్టోస్టెరోన్‌ లాంటివి) ఎక్కువగా ఉంటుంది. పురుషహార్మోన్‌లు పెరగడం అక్నే/మొటిమలు మరియు హిర్సూటిజం/వెంట్రుకలు ఎక్కువగా పెరగడానికి దారితీస్తుంది.


4) ఊబకాయం/బరువు పెరగడం:
ఊబకాయం లేదా ఎక్కువగా బరువు పెరగడం అనేది పిసిఒఎస్‌ యొక్క సామాన్యమైన లక్షణం. పిసిఒఎస్‌ గల మహిళల్లో దాదాపు 50% మంది ఊబకాయులు. తినే అలవాట్లు మరియు మారుతున్న జీవనశైలి పిసిఒఎస్‌ గల ఆడవాళ్ళను మరింత ఊబకాయులుగా చేస్తుంది.
ఊబకాయం అనేది పిసిఒఎస్‌ ఆడవాళ్ళల్లో సామాన్యంగా కనుగొనబడుతుంది, ఎందుకంటే వాళ్ళ శరీర కణాలు ఇన్సులిన్‌ అనే చక్కెర/గ్లూకోజ్‌ని నియంత్రించే హార్మోన్‌ని ప్రతిఘటిస్తాయి కాబట్టి. H^ కొవ్వుగా నిల్వచేయబడే చక్కెరను/గ్లూకోజ్‌ని వినియోగించుకోకుండా ఈ ఇన్సులిన్‌ ప్రతిఘటన కణాలను నిరోధించి, తద్వారా ఊబకాయం లేదా బరువు పెరుగుదలకు దారితీస్తుంది.
హార్మోన్‌ల లోపల అసమతుల్యాన్ని కూడా ఊబకాయం కలిగిస్తుంది, ఇది బహిష్ఠు వ్యవధులను ప్రభావితం చేస్తుంది. మీరు ఊబకాయంతో లేదా ఎక్కువ బరువుతో ఉంటే, బరువు కోల్పోవలసిందిగా మరియు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవలసిందిగా సిఫారసు చేయబడుతోంది.

5) పిగ్మెంటేషన్‌, ప్రత్యేకించి మెడపై మరియు చంకల్లో:
పిసిఒఎస్‌ గల మహిళలు మెడ వెనుక, చంకల్లో, నుదురుపై, సంభావ్యంగా శరీరంలోని కొన్ని ఇతర భాగాల్లో పిగ్మెంటేషన్‌ లేదా నల్లని చర్మ మచ్చలతో బాధపడవచ్చు. రక్తంలో ఇన్సులిన్‌ హార్మోన్‌ చాలా ఎక్కువగా ఉండటం వల్ల ఇలా జరుగుతుంది. వెంటనే గైనకాలజిస్టును సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలని సలహ.6) వంధ్యత్వం:
వంధ్యత్వం అంటే గర్భందాల్చడంలో (గర్భధారణ) కష్టమని అర్థం. ప్రస్తుత కాలంలో వంధ్యత్వానికి (పిల్లలను కనలేకపోవడం) గల అత్యంత సామాన్యమైన కారణంలో పిసిఒఎస్‌ ఒకటి. పిసిఒఎస్‌ గల ఆడవాళ్ళల్లో బహిష్ఠు పీరియడ్‌లు క్రమం తప్పి ఉండటం లేదా రాకపోవడం తరచుగా ఒవులేషన్‌ (అండాలు ఏర్పడటం మరియు అండాశయం నుంచి విడుదల కావడం) లేకపోవడంతో ముడిపడివుంటోంది, ఇది గర్భధారణ లేదా గర్భవతి అయ్యే అవకాశాలను తగ్గిస్తుంది.
గర్భందాల్చడం మీకు కష్టంగా ఉంటే, డాక్టరును సంప్రదించండి, ఎందుకంటే అది పిసిఒఎస్‌ అయివుండొచ్చు.


+ పిసిఒఎస్‌కి చికత్స చేయకపోతే కలిగే ప్రభావాలు ఏమిటి?
పిసిఒఎస్‌ గురించి ఎవరైనా సరే అర్థంచేసుకోవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఇది కేవలం సౌందర్యం లేదా బహిష్ఠు పీరియడ్‌ సమస్యమే కాదు. అనేక దీర్ఘకాలిక సమస్యలు కలిగే అపాయంతో ఇది ముడిపడివుండొచ్చు. పిసిఒఎస్‌ గల మహిళలు లక్షణాలు పోయినప్పటికీ రుతువిరతి వరకు గైనకాలజిస్టును నిత్యపరిపాటి ప్రాతిపదికన తను ఆరోగ్య పరీక్ష చేయించుకోవడం ముఖ్యం.

చికిత్సచేయించుకోని పిసిఒఎస్‌ మహిళలకు ఈ కింది స్థితులు లేదా వ్యాధులు కలిగే అపాయం అధికంగా ఉంటుంది:
 • వంధ్యత్వం/గర్భందాల్చలేకపోవడం
  ఇంతకుముందే చర్చించినట్లుగా పిసిఒఎస్‌ అనేది వంధ్యత్వం లేదా గర్భందాల్చలేకపోవడానికి ఒక సామాన్యమైన కారణం. ఆ విధంగా పిసిఒఎస్‌ని ముందుగానే నిర్ధారించడం భవిష్యత్తులో వంధ్యత్వాం యొక్క అపాయాన్ని నివారించడానికి తప్పనిసరి. • డయాబెటీస్
  పిసిఒఎస్‌ గల దాదాపు 50% ఆడవాళ్ళకు 40 సంవత్సరాల వయస్సు లోపు డయాబెటీస్‌ లేదా ప్రీడయాబెటీస్‌ ఉంటుంది. కాబట్టి, మీకు పిసిఒఎస్‌ ఉంటే, డయాబెటీస్‌ని నిరోధించేందుకు వ్యాయామం చేయవలసిందిగా మరియు ఆహారపు అలవాట్లను మార్చుకోవలసిందిగా సిఫారసు చేయబడుతోంది. • ఎక్కువ రక్త కొలెస్ట్రాల్‌ మరియు గుండె జబ్బు
  పిసిఒఎస్‌ గల ఆడవాళ్ళు అధిక రక్త కొలెస్ట్రాల్‌కి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. గుండె జబ్బు అనేది కొలెస్ట్రాల్‌కి సన్నిహితంగా సంబంధించింది కాబట్టి, పిసిఒఎస్‌ గల ఆడవాళ్ళకు ఇలాంటి వ్యాధి (గుండె పోట్లు) కలిగే అపాయం పెరగవచ్చు. • గర్భం దాల్చడంలో సమస్యలు
  పిసిఒఎస్‌ గల మహిళలకు గర్భధారణలో సంక్లిష్టసమస్యలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీటిల్లో పాపాయిలు ముందుగానే పుట్టడం లేదా గర్భధారణలో (ప్రీ-ఎక్లాంప్సియా) అధిక రక్త పోటు కలగడం లేదా గర్భధారణలో డయాబెటీస్‌ కలగడం కూడా ఉంటాయి. మీకు పిసిఒఎస్‌ ఉంటే, మీరు తరచుగా పరీక్ష చేయించుకోవాలి.


 • ఎండోమెట్రియల్‌ క్యాన్సరు/యుటెరస్‌ లైనింగ్‌కి క్యాన్సరు
  చర్చించినట్లుగానే పిసిఒఎస్‌ గల ఆడవాళ్ళకు క్రమం తప్పి బహిష్ఠు పీరియడ్‌లు కలిగే లేదా బహిష్ఠు పీరియడ్‌లు కలగకపోవడం జరుగుతుంది. ఆ విధంగా, యుటెరస్‌ లైనింగ్‌కి క్యాన్సరు కలిగే అపాయం వాళ్ళకు అధికంగా ఉండవచ్చు.కాబట్టి, మీకు పిసిఒఎస్‌ ఉందా అనే విషయంలో మీకు సందేహం ఉన్నప్పటికీ, దయచేసి మీ లక్షణాలను విస్మరించకండి. ఈ మైనర్‌ ఫిర్యాదులకు మించి చూడవలసిన అత్యవసరం ఉంది, మరియు మీకు కలిగే ఆరోగ్య సమస్యల తీవ్రతను గ్రహించవలసి ఉంటుంది.

+ పిసిఒఎస్‌ కలగడానికి గల కారణాలు ఏమిటి?
ఇప్పుడు మనం తెలుసుకున్నట్లుగా పిసిఒఎస్‌ అనేది అనేక-అంశాల డిజార్డరు. పిసిఒఎస్‌ కలగడానికి ఈ కిందివి సాధ్యమైన కారణాలు:
 • జీవనశైలి మార్పులు: అనారోగ్యకరమైన ఆహార పదార్థాలు, జంక్‌ ఫుడ్‌లు తినడం మరియు వ్యాయామం చేయకపోవడం ఆడవాళ్ళు బరువు పెరగడానికి దారితీస్తుంది. ఊబకాయం లేదా బరువు పెరగడం హార్మోన్‌లను అదుపు తప్పిస్తుంది, ఇది మీ బహిష్ఠు పీరియడ్‌లను ప్రభావితం చేస్తుంది.
 • ఇన్సులిన్‌ ప్రతిఘటన: 50-80% కేసుల్లో ఇన్సులిన్‌ ప్రతిఘటన ప్రధాన కారణంగా ఉంటుంది. ఇది ఆడవాళ్ళ బరువును పెంచడానికి కూడా దారితీస్తుంది, ఇది పిసిఒఎస్‌ లక్షణాలను ఎక్కువయేలా చేస్తుంది.
 • హార్మోన్‌ల అసమతుల్యం: పిసిఒఎస్‌ గల మహిళల్లో కొన్ని హార్మోన్‌లలో అదుపులేకుండా ఉండటం సామాన్యంగా జరుగుతుంది.
 • కుటుంబ చరిత్ర: తల్లికి, ఆంటీకి లేదా సోదరికి కూడా పిసిఒఎస్‌ ఉంటే/ఉండివుంటే మహిళకు ఇది కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

+ డాక్టరును ఎప్పుడు సంప్రదించాలి?
మీరు అక్నే/మొటిమలు లాంటి ఒకటి లేదా ఎక్కువ చిహ్నాలు మరియు లక్షణాల్లో వేటినైనా, లేదా హిర్సూటిజం/అమితంగా వెంట్రుకలు పెరగడంతో బాధపడుతుంటే, దయచేసి సమీపంలో ఉన్న కన్సల్టెంట్‌ని (గైనకాలజిస్టును) సంప్రదించండి. ఎందుకంటే, వంధ్యత్వం, (పిల్లలను కనలేకపోవడం) డయాబెటీస్‌, గుండె జబ్బులు మరియు గర్భధారణ సంక్లిష్ట సమస్యలు మొదలైనటువంటి దీర్ఘకాలిక సమస్యలు అనేకం కలిగే అపాయాలను పిసిఒఎస్‌ పెంచవచ్చు కాబట్టి.

పిసిఒఎస్‌ని ముందుగానే నిర్ధారణ చేయడం మీకు భవిష్యత్తులో వంధ్యత్వం (పిల్లలను కనలేకపోవడం) లాంటి దీర్ఘకాలిక సమస్యలు కలగడాన్ని నివారిస్తుంది. కాబట్టి, ఆలస్యం కాకముందే స్పందించండి.

+ పిసిఒఎస్‌కి చికిత్స ఏమిటి?
ఎవరైనా సరే పిసిఒఎస్‌ని అదుపుజేసుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి. మేనేజ్‌మెంట్‌ ఆప్షన్‌లు లక్షణాల తీవ్రతపై ఆధారపడి ఉంటాయి.

జీవన శైలిని మార్చుకొనుట:

పిసిఒఎస్‌ గల మహిళలు, ఆరోగ్యకరమైన జీవన శైలి మార్పులు చేసుకోవడం ఈ స్థితిని అదుపుజేయడానికి చాలా ఉపయోగకరంగా ఉండొచ్చు. కాబట్టి ఊబకాయంతో ఉన్నా లేదా బక్కగా ఉన్నప్పటికీ, దానితో నిమిత్తం లేకుండా, పిసిఒఎస్‌ గల ఆడవాళ్ళందరూ జీవనశైలిని మేనెజ్‌చేసుకోవడం ముఖ్యం.

ఆరోగ్యకరమైన ఆహారం తినడం మీరు పోషకాలు, విటమిన్‌లు మరియు మినరల్స్ గల ఆరోగ్యకరమైన ఆహారం తీసుకునేలా చూస్తుంది మరియు డయాబెటీస్‌ మరియు గుండె జబ్బు లాంటి దీర్ఘకాలిక వ్యాధులు కలిగే అపాయం తగ్గించవచ్చు.

జిఐ తక్కువగా ఉన్న ఆహారం తినడం: తక్కువ గ్లైసెమిక్‌ ఇండెక్స్ (జిఐ) ఉన్న ఆహారాలు తినడం ద్వారా ఏ మహిళ అయినా రక్త చక్కెరలను అదుపు చేసుకోవచ్చు మరియు పిసిఒఎస్‌ లక్షణాలను మెరుగుపరచుకోవచ్చు. జిఐ తక్కువగా ఉన్న ఆహారాల్లో ధాన్యలు, లీన్‌ ప్రొటీన్‌లు, నట్‌లు మరియు గింజలు, చాలా ఎక్కువగా తాజా పండ్లు మరియు పిండి-లేని కూరగాయలు ఉంటాయి. మీ నిర్దిష్టమైన అవసరాల కోసం ఏవి ఉత్తమ ఆహార ఎంపికలనే విషయం తెలుసుకునేందుకు తప్పకుండా మీ డాక్టరుతో లేదా న్యూట్రిషనిస్టుతో మాట్లాడండి. కొవ్వు తక్కువగా ఉన్న ఆహారం తీసుకోవలసిందిగా కూడా సలహా ఇవ్వబడుతోంది.

ఒకేసమయంలో తక్కువగా తినండి, రోజులో ఎక్కువ సార్లు తినండి: రోజులో ఎక్కువ సార్లు చిన్న మొత్తాల్లో ఆహారం తినడం మీ రక్త చక్కెరను అదుపులో ఉంచుకోవడానికి సహాయపడవచ్చు. ప్రతి 3-4 గంటలకు ఏదైనా తినేలా చేసుకోవాలి.నీళ్ళ ఎక్కువగా తాగండి: ఇన్సులిన్‌కి ప్రతిఘటన కారణంగా, పిసిఒఎస్‌ గల మహిళలు నీటి వల్ల బరువు పెరగడం లేదా త్వరగా నీరు కోల్పోవడాన్ని అనుభవించవచ్చు. కాబట్టి, రోజుకు కనీసం 8 గ్లాసుల నీళ్ళు మీరు తాగడం చాలా ముఖ్యం.శారీరక కార్యకలాపం లేదా వ్యాయామం: ఇది మీలో శక్తి స్థాయిలను పెంచుతుంది, ఆత్మ గౌరవాన్ని మెరుగుపరుస్తుంది మరియు మీ ఒత్తిడిని తగ్గిస్తుంది. బరువును అదుపులో ఉంచుకోవడానికి సహాయపడేందుకు ప్రతి రోజూ కనీసం 30 నుంచి 60 నిమిషాల సేపు శారీరక కార్యకలాపం చేయవలసిందిగా ప్రభుత్వ మార్గదర్శకాలు సిఫారసు చేస్తున్నాయి.


ఆహారాంతో శారీరక కార్యకలాపాన్ని కలపడం ద్వారా లేదా వ్యాయామాన్ని మార్చడం ద్వారా ఆహార చార్టును పాటించడం కంటే బరువును మరింత మెరుగ్గా అదుపుజేసుకోవచ్చు.

ఊబకాయం మరియు అధిక బరువు గల పిసిఒఎస్‌ మహిళలు బరువు తగ్గితే మరియు ఆరోగ్యకరమైన జీవనశైలిని అవలంబించడం వాళ్ళకు డయాబెటీస్‌ మరియు గుండె జబ్బులు లాంటి దీర్ఘ కాలిక ఆరోగ్య సమస్యలు కలిగే అపాయాన్ని గణనీయంగా తగ్గిస్తుంది.

మందులు:

మీరు పిసిఒఎస్‌తో బాధపడుతుంటే, మైయో-ఐనోసిటోల్‌ మరియు మెట్‌ఫార్మిన్‌ లాంటి ఇన్సులిన్‌ని తగ్గించే మందులు, పురుష-హార్మోన్‌ల నిరోధక మందులు, గర్భనిరోధక మాత్రలు, ఒవులేషన్‌ని ప్రేరేపించే మందులు, విటమిన్‌ డి అనుబంధం మొదలైనవి తీసుకోవలసిందిగా మీ డాక్టరు మిమ్మల్ని అడగవచ్చు. పైన ఇవ్వబడిన థెరపీకి రోగి స్పందించకపోతే డాక్టరు సర్జరీని కూడా సిఫారసు చేయవచ్చు.

ఏవైనా మందులు తీసుకోవడానికి ముందు దయచేసి మీకు సమీపంలో ఉన్న గైనకాలజిస్టును సంప్రదించండి.
Social   |     |     |